భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. కెనడా, బ్రిటన్ దేశాలకు చెందిన పౌరులకు ఈ`వీసాలు నిరాకరించింది. కరోనా సమయంలో భారత ప్రయాణికుల ఎంట్రీపై కెనడా, యూకే కఠినంగా వ్యవహరించిన నేపథ్యంలోనే ఇప్పుడు భారత్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ రెండు దేశాలలో అతితో కోవిడ్ సమయంలో భారత ప్రయాణికులు అసౌకర్యానికి గురయ్యారు. అనంతరం రెండు దేశాల్లో ఎంబసీ అధికారులు కలుగజేసుకుని సమస్యను పరిష్కరించారు. ఈ మేరకు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఒకరు కీలక ప్రకటన చేశారు.
ఈ ఏడాది ఆగస్టు మొదటి వారం నుంచి కెనడా, యూకే పౌరులకు ఈ`వీసా సౌకర్యాన్ని నిలిపివేయడం జరిగింది. ప్రస్తుతం వారు భారత ఎంబసీల్లో రెగ్యులర్ స్టిక్కర్ వీసాలకు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. పర్యాటక వీసా ఇప్పటికే నిలిపివేయబడిరది. ఇతర కేటగిరీ వీసాలపై భారత్‌కు వచ్చే ఈ రెండు దేశాల పౌరులు ఇప్పుడు కేవలం రెగ్యులర్ స్టిక్కర్ వీసాల కోసం దరఖాస్తు చేసుకోవాలి అని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి తెలిపారు.