పుట్‌బాల్ అభిమానులకు శుభవార్త ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఎనిమిదో సీజన్ షెడ్యూల్ విడుదలైంది. నవంబర్ 19న మొదలయ్యే ఐఎస్‌ఎల్‌లో ఏటీకే మోహన్ బగాన్, కేరళ బ్లాస్టర్స్ మధ్య తొలి మ్యాచ్ జరుగనుంది. 2021`22 సీజన్‌లో మొత్తం 115 మ్యాచ్‌లు జరుగనుండగా, జనవరి 9 వరకు జరిగే తొలి దశలో 11 రౌండ్లలో 55 మ్యాచ్‌లు ఉన్నాయి. గోవా వేదికగా జరిగే లీగ్‌లో ప్రతి శనివారం రెండు మ్యాచ్‌లు జరుగనున్నాయి. తొలి మ్యాచ్ 7:30 మొదలు కానుండగా, రెండో మ్యాచ్ 9:30 ప్రారంభమవుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే హైదరాబాద్ ఎఫ్‌సీ జట్టు తమ తొలి మ్యాచ్‌లో నవంబర్ 23న చెన్నై యిన్ ఎఫ్‌సీతో తలపడుతుంది. గోవాలోని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియం (ఫటోర్టా) అథ్లెటిక్ స్టేడియం (బోంబోలిమ్), తిలక్ మైదాన్ స్టేడియం (వాస్కో)లలో నిర్వహించనున్నారు.