Namaste NRI

రోమ్‌లో ఆసక్తికర ఘటన..వచ్చిన విషయాన్ని మర్చిపోయి

Mayfair 124

ఇటలీ రాజధాని రోమ్‌లో ఆసక్తికర ఘటన జరిగింది. ఓ దొంగ (38)ను ఓ ఇంట్లోని టేబుల్‌పై కనిపించిన పుస్తకం ఆకర్షించింది. దీంతో చోరీకి వచ్చానన్న విషయాన్ని మర్చిపోయి పుస్తకం చదవడంలో అతడు మునిగిపోయా డు. మెలకువ వచ్చిన యజమాని (71) వచ్చి అతడిని తడితే కానీ ఈ లోకంలోకి రాలేదు. ఆయనను చూసి షాకైన దొంగ పరారయ్యేందుకు ప్రయత్నించాడు. అయితే అప్పటికే అతడు పోలీసులకు దొరికిపోయాడు. దొంగను అంతగా ఆకర్షించిన ఆ పుస్తకం పేరు ది గాడ్స్‌ ఎట్‌ సిక్స్‌ ఓ క్లాక్‌. గ్రీకు పురాణాలకు సంబంధించిన ఈ పుస్తకాన్ని ప్రముఖ రచయిత గియోవన్నీ నుచీ రాశారు.

Ixora 124
Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events