Skip to main content

Namaste NRI

తెలంగాణ ప్రజా ప్రతినిధులకు ఆటా ఆహ్వానం

రవీంద్రభారతిలో ఈ నెల 30న నిర్వహించనున్న ఆటా సేవా కార్యక్రమాల గ్రాండ్‌ ఫినాలేకు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్‌ రావు, మాజీ ఎంపీ కొండా విశేశ్వర్‌ రెడ్డిలను ఆటా వేడుకల చైర్‌ ఎలెక్ట్‌ ప్రెసిడెంట్‌ జయంత్‌ చల్లా ఆధ్వర్యంలో ఇతర ప్రతినిధులు స్పీకర్‌ను ఆయన నివాసంలో, మంత్రులను సెక్రటేరియట్‌లో కలిసి ఆహ్వానించారు. ఆటా గ్రాండ్‌  ఫినాలేతో పాటు, 2024 జూన్‌ 7,8, 9 తేదీలలో అమెరికా, అట్లాంటాలో నిర్వహించే కాన్ఫరెన్స్‌కు కూడా హాజరై అక్కడి తెలుగువారికి తమ అభినందనలు తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆటా కో చైర్‌ వేణు సంకినేని, ఆటా సెక్రెటరీ రామకృష్ణ రెడ్డి అల, ట్రెజరర్‌ సతీష్‌ రెడ్డి, జాయింట్‌ ట్రెజరర్‌ రవీందర్‌ గూడూరు, 18వ ఆటా కాన్ఫరెన్స్‌ కన్వీనర్‌ సాయి సూధిని, బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీస్‌ కాశీ కొత్త, నరసింహారెడ్డి ద్యాసాని, ఇండియా కో ఆర్డినేటర్‌ జ్యోత్స్న రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News