ఐపీఎల్ లో మళ్లీ అభిమానులు సందడి చేయనున్నారు. ఈ నెల 19 నుంచి యూఏఈలో ప్రారంభం కానున్న ఈ టోర్నీకి ప్రేక్షకులను అనుమతించాలని నిర్ణయించారు. అయితే పరిమిత స్థాయిలోనే అనుమతించనున్నట్లు ఐపీఎల్ ఒక ప్రకటనలో వెల్లడిరచింది. ఐపీఎల్ 2021 గత మార్చిలో ఇండియాలో ప్రారంభమైనా.. కరోనా కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ టోర్నీ చెన్నై, ముంబై మ్యాచ్‌తో మళ్లీ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లు దుబాయ్, షార్జా, అబు దాబిలలో జరగనున్నాయి. గతేడాది కూడా ఐపీఎల్ ఇక్కడే జరిగినా అప్పుడు అభిమానులు అనుమతించలేదు. అభిమానులు టికెట్లను ఐపీఎల్ అధికారిక వెబ్‌సైట్ www.iplt20.com లో కొనుగోలు చేయవచ్చు. 16వ తేదీ నుంచి టికెట్లు లభ్యమవుతాయని ప్రకటించింది. కాగా సెప్టెంబర్ 19వ తేదీన ముంబై మరియు చెన్నైల మధ్య మొదటి మ్యాచ్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.