Namaste NRI

ఐపీఎల్ షెడ్యూల్ విడుద‌ల  

ఐపీఎల్ 17వ సీజ‌న్ పూర్తి షెడ్యూల్ వ‌చ్చేసింది. టోర్నీ ఆరంభానికి ముందు తొలి విడ‌త షెడ్యూల్ విడుద‌ల చేసిన బీసీసీఐ తాజాగా పూర్తి షెడ్యూల్‌ను ప్ర‌క‌టించింది. ఈసారి మొత్తం 74 మ్యాచ్‌ల‌ను భార‌త్‌లోనే నిర్వ‌హి స్తామ‌ని స్ప‌ష్టం చేసింది. అంతేకాదు క్వాలిఫ‌య‌ర్, ఎలిమినేట‌ర్ మ్యాచ్‌ల‌కు అహ్మ‌దాబాద్‌లోని న‌రేంద్ర మోడీ స్టేడియం వేదిక కానుందని తెలిపింది. ఇక ఫైన‌ల్ ఫైట్‌ను అంద‌రూ ఊహించిన‌ట్టుగానే చెన్నైలోని చెపాక్ స్టేడియం లో నిర్వ‌హించనున్నారు. మే 26వ తేదీన టైటిల్ పోరు జ‌రిగే చాన్స్ ఉంది.

ఏప్రిల్ 7వ తేదీన మొద‌టి విడ‌త మ్యాచ్‌లు ముగిసిన తెల్లారే రెండో విడ‌త ప్రారంభం కానుంది. ఏప్రిల్ 8వ తేదీన చెన్నై సూప‌ర్ కింగ్స్, కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి. మే 21వ తేదీన క్వాలిఫ‌య‌ర్ 1, మే 22న ఎలిమినేట‌ర్ పోరు జ‌రుగ‌నుంది. చెపాక్ స్టేడియంలో మే 24వ తేదీన క్వాలిఫ‌య‌ర్ 1, మే 26న ఫైన‌ల్ మ్యాచ్‌లు జ‌రుగ‌నున్నాయి. నిరుడు గుజ‌రాత్, చెన్నై జ‌ట్లు ఫైన‌ల్ చేరినందున క్వాలిఫ‌య‌ర్, ఫైన‌ల్ మ్యాచ్‌లను అహ్మ‌దాబాద్‌, చెపాక్‌లో జ‌ర‌పాల‌ని బీసీసీఐ నిర్ణ‌యించింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events