హీరో సుమంత్ ఏడడుగులు వేయనున్నారా? అంటే అవుననే అంటోంది ఫిల్మ్‌నగర్. పవిత్ర అనే అమ్మాయితో సుమంత్ పెళ్లి నిశ్చయమైందని సమాచారం. ఈ మేరకు సుమంత్ పవిత్రల పెళ్లి పత్రిక అంటూ నెట్టింట్లో ఒక ఫొటో హల్‌చల్ చేస్తోంది. ఇరు కుటుంబ పెద్దలు, అత్యంత సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో వీరి వివాహం జరగనుందట. ఇదిలా ఉంటే సుమంత్‌కు హీరోయిన్ కీర్తిరెడ్డితో 2004లో వివాహమైన సంగతి తెలిసిందే. అయితే ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం సుమంత్ పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్నారు.