Namaste NRI

ఉత్సాహంగా జరిగిన తానా మిడ్-అట్లాంటిక్ వనభోజనాలు

తానా మిడ్-అట్లాంటిక్ ఆధ్వర్యంలో ఫిలడెల్ఫియా వేదికగా వనభోజనాలు (పిక్నిక్) కార్యక్రమం ఘనంగా జరిగింది. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో డెలవేర్, హ్యారిస్బర్గ్, అలెన్టౌన్, పిట్స్బర్గ్ ప్రాంతాల నుంచి 2 వేల మందికిపైగా తెలుగు వారు హాజరయ్యారు. అంతా కలిసి భోజనాలు చేసి సరదాగా గడిపారు. మిడ్-అట్లాంటిక్ రీజనల్ రిప్రజంటేటివ్ వెంకట్ సింగు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ రవి పొట్లూరి, సతీష్ తుమ్మల, సునీల్ కోగంటి తదితరులంతా కలిసి వాలంటీర్లతో మంచి కో-ఆర్డినేషన్తో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

తానా సెక్రటరీ రాజా కసుకుర్తి, ఇతర తానా లీడర్లు కూడా ఈ వనభోజనాలకు హాజరై మిడ్-అట్లాంటిక్ వాలంటీర్ టీంకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఆగస్టు 24న జరిగిన చెస్ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి ఈ వనభోజనాల సందర్భంగా బహుమతులు అందజేశారు.


ఈ క్రమంలోనే సెప్టెంబరు 15న జరగనున్న లేడీస్ నైట్కు మహిళలంతా హాజరవ్వాలని మిడ్-అట్లాంటిక్ వుమెన్ టీం చైర్ సరోజ పావులూరి కోరారు. అక్టోబర్ 19న జరిగే కల్చరల్ ప్రోగ్రామ్స్లో పాల్గొనాలని విద్యార్థులు, టీచర్లను మిడ్-అట్లాంటిక్ కల్చరల్ కమిటీ చైర్ సురేష్ యలమంచి ప్రోత్సహించారు.

అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వరద బాధితుల సహాయార్థం తానా ఫిల్లీ యూత్ టీం 2500 డాలర్ల విరాళాలు సేకరించింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కృషి చేసిన వాలంటీర్ బృందానికి రవి పొట్లూరి, వెంకట్ సింగు ధన్యవాదాలు తెలిపారు.

ఈ వనభోజనాలకు ఫని కంథేటి, గోపి వాగ్వల, సురేష్ యలమంచి, కృష్ణ నందమూరి, రంజిత్ మామిడి, నాయుడమ్మ యలవర్తి, కోటి యాగంటి, చలం పావులూరి, ప్రసాద్ క్రొత్తపల్లి, శ్రీ అట్లూరి, విశ్వనాథ్ కోగంటి, మోహన్ మల్ల, సతీష్ చుండ్రు, వెంకట్ ముప్ప, రాజు గుండాల, శ్రీని కోట, శ్రీనివాస్ అబ్బూరి, సరోజ పావులూరి, భవానీ క్రొత్తపల్లి, రాజశ్రీ కొడాలి, రమ్య పావులూరి, మనీషా మేక, అపర్ణ వాగ్వల, పవన్ నడింపల్లి, సంతోష్ రౌతు, శ్రీకాంత్ గూడూరు, వెంకట్ గూడూరు, హేమంత్ యేర్నేని తదితరులు పాల్గొన్నారు. ధన్యవాదాలు తెలిపిన రవి పొట్లూరి పిక్నిక్ ముగించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events