Namaste NRI

అది ఉద్దేశపూర్వకంగా చేసిన దాడి కాదు : డొనాల్డ్ ట్రంప్

యుద్ధం సందర్భంగా ఇరాన్‌ లోని బాలికల పాఠశాల పై జరిగిన వైమానిక దాడి ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఫ్రాన్స్ ‌లో జరుగుతున్న జీ-7 సదస్సు లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ యుద్ధంలో ఇలాంటి పొరపాట్లు జరుగుతుంటాయని, దీన్ని ఎవరూ ఉద్దేశపూర్వకంగా చేయలేదని వ్యాఖ్యానించారు. అయితే ఈ ఘటనకు బాధ్యతపై అడిగిన ప్రశ్నకు ఆయన నేరుగా సమాధానం ఇవ్వకుండా దాటవేశారు.

ఈ ఏడాది ఫిబ్రవరి 28న దక్షిణ ఇరాన్‌లోని మినాబ్‌లో ఉన్న షజారా తయ్యేబే ప్రాథమిక పాఠశాలపై జరిగిన వైమానిక దాడిలో 170 మందికి పైగా మరణించారు. వారిలో అత్యధికులు చిన్నారులే కావడం గమనార్హం. ఈ దారుణం జరిగి 100 రోజులు గడిచినప్పటికీ దీనిపై పెంటగాన్ దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని ట్రంప్ వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సెత్‌ను సంప్రదించాలని ఆయన సూచించారు.


Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events