Skip to main content

Namaste NRI

చెన్నై లవ్ స్టోరీ క్లాస్ కాదు.. పక్కా మాస్: కిరణ్ అబ్బవరం

కిరణ్‌ అబ్బవరం హీరోగా నటిస్తున్న చిత్రం చెన్నై లవ్‌స్టోరీ. శ్రీగౌరి ప్రియ కథానాయిక. రవి నంబూరి దర్శకత్వం. ఈ చిత్రాన్ని ఎస్‌కేఎన్‌, సాయిరాజేశ్‌ నిర్మిస్తున్నారు. బుధవారం హీరో కిరణ్‌ అబ్బవరం జన్మదినం. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ఐదారేళ్లలో మీ దగ్గరి నుంచి ఎంతో ప్రేమను సంపాదించుకున్నా. ఎత్తుపల్లాలు, ఒడిదుడుకులు చూశాను. మంచి సినిమాలు చేసి మీ ఆదరణ పొందాలని నిత్యం ప్రయత్నిస్తున్నా అని అన్నారు.ఈ సినిమాలో పవిత్రమైన ప్రేమంటే ఏమిటో చూస్తారని, ఒక అమ్మాయిని ఇంత గొప్పగా ప్రేమించవొచ్చా అని ప్రతి ఒక్కరూ అనుకుంటారని, కథలోని మాస్‌ అంశాలు కూడా ఆకట్టుకుంటాయని పేర్కొన్నారు.

బేబీ తరహాలోనే స్ట్రైకింగ్‌ ఎలిమెంట్స్‌ ఉన్న లవ్‌స్టోరీ ఇదని, నైజాంలో మైత్రీ సంస్థ ద్వారా విడుదల చేయబోతున్నామని నిర్మాత ఎస్‌కేఎన్‌ తెలిపారు. ఈ సినిమాలో హీరోహీరోయిన్లు స్టీవెన్‌, విని పాత్రలతో ప్రతి ఒక్కరూ కనెక్ట్‌ అవుతారని దర్శకుడు రవి నంబూరి అన్నారు. ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, కథ: సాయిరాజేష్‌, సహ నిర్మాత: ధీరజ్‌ మొగిలినేని, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రవి నంబూరి.

Social Share Spread Message

Latest News