Namaste NRI

ఈ ఏడాదిలో ఇది మూడ‌వ‌సారి: ఉత్త‌ర కొరియా  

ఉత్త‌ర కొరియా ఇంట‌ర్మీడియ‌ట్ రేంజ్ బాలిస్టిక్ క్షిప‌ణిని ప‌రీక్షించింది. జ‌పాన్ స‌ముద్ర జ‌లాల దిశ‌గా ఆ మిస్సైల్‌ను టెస్ట్ చేసింది. ఆ క్షిప‌ణి ప్రొజెక్టైల్ స‌ముద్ర జ‌లాల్లో ప‌డిన‌ట్లు జ‌పాన్ ర‌క్ష‌ణ మంత్రి తెలిపారు. ఉత్త‌ర కొరియా ప‌శ్చిమ తీరం నుంచి దాన్ని ప‌రీక్షించిన‌ట్లు తెలుస్తోంది. విమానాల‌కు కానీ నౌక‌ల‌కు కానీ ఎటువంటి న‌ష్టం జ‌ర‌గ‌లేద‌ని ప్ర‌భుత్వం వ‌ర్గాలు చెబుతున్నాయి. ఈ ఏడాది బాలిస్టిక్ క్షిప‌ణిని ప‌రీక్షించ‌డం ఇది మూడ‌వ‌సారి. ఆ క్షిప‌ణికి హైప‌ర్‌సోనిక్ వార్‌హెడ్‌ను అమ‌ర్చిన‌ట్లు ద‌క్షిణ కొరియా మిలిట‌రీ అధికారులు వెల్ల‌డించారు. సుమారు 600 కిలోమీట‌ర్ల దూరం ఆ క్షిప‌ణి ప్ర‌యాణించి ఉంటుంద‌ని అంచ‌నా వేశారు.జ‌పాన్ ప్ర‌ధాని ఫుమియో కిషిదా ఈ ప్ర‌యోగాన్ని ఖండించారు. ఉత్త‌ర కొరియా ఈ ఏడాది చాలా సార్లు బాలిస్టిక్ క్షిప‌ణు ల‌ను ప్ర‌యోగించింద‌ని, దీంతో ప్రాంతీయ భ‌ద్ర‌త‌కు ముప్పు ఉంద‌ని, దీన్ని ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఆమోదించ‌ బోమ‌ని ఆయ‌న అన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events