రాకేష్ వర్రె హీరోగా విరించి వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జితేందర్ రెడ్డి. ముదుగంటి క్రియేషన్స్ పతాకంపై ముదుగంటి రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు. 1980 దశకంలో ఓ వ్యక్తి జీవితంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించాం. సమాజం పట్ల ఎంతో అంకితభావం కలిగిన ఆ యువకుడు కాలేజీ నాయకుడిగా, అనంతరం పోలీస్ ఆఫీసర్‌గా ఎదిగి వ్యవస్థను ఎలా ప్రక్షాళనం చేశాడనే అంశాలను చూపిస్తున్నాం. పొలిటికల్ థ్రిల్లర్‌గా ఆకట్టుకుంటుంది అని చిత్రబృందం పేర్కొంది. ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రానికి కెమెరా: వి.ఎస్.జ్ఞానశేఖర్, సంగీతం: గోపి సుందర్.