Skip to main content

Namaste NRI

జో బైడెన్‌ ఉక్రెయిన్‌ పర్యటనపై.. వైట్‌హౌస్‌ క్లారిటీ

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌కు వెళ్లి మద్దతు తెలుపుతారని వార్తలు వచ్చాయి. దీనిపై వైట్‌హౌస్‌ స్పందించింది. కీవ్‌లో జో బైడెన్‌ పర్యటించబోవడం లేదని వైట్‌హౌస్‌ ప్రెస్‌ సెక్రటరీ జెన్‌ సాకి వెల్లడిరచారు. యూరోపియన్‌ యూనియన్‌కు చెందిన పలువురు కీలక నేతలు కీవ్‌లో పర్యటించి అక్కడి పరిస్థితులను సమీక్షించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను తమ దేశానికి రావలసిందిగా ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్స్‌కీ ఆహ్వానించారు. దీనిపై జెన్‌ సాకి మాట్లాడుతూ ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌కు బైడెన్‌ను పంపే యోచన ఏదీ లేదని స్పష్టం చేసింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events