Skip to main content

Namaste NRI

 జో బైడెన్‌ కీలక ప్రకటన.. యూరప్‌లో

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ కీలక ప్రకటన చేశారు. రష్యా ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకొని యూరప్‌లో  నాటో బలాన్ని పెంచేందుకు కృషి చేస్తామని ప్రకటించారు. యూరప్‌లో ప్రస్తుతం ఉన్న నాటో దళాలను మరింత శక్తిమంతంగా మారుస్తామని అన్నారు.  దీనిలో భాగంగా పోలాండ్‌లో యూఎస్‌ 5వ యూనిట్‌ ఆర్మీ కార్ప్స్‌ హెడ్‌క్వార్టర్స్‌ ఏర్పాటు చేస్తామని తెలిపారు. నేల, వాయు, సముద్ర మార్గాలు అన్నింటా నాటోను మరింత బలంగా చేస్తాం అని స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌, రష్యా మధ్య యుద్ధం జరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో బైడెన్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Social Share Spread Message

Latest News