Namaste NRI

సూపర్‌స్టార్ కృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించిన కమల్ హాసన్

దివంగత నటుడు, సూపర్‌ స్టార్ కృష్ణ విగ్రహావిష్కరణ కార్యక్రమం విజయవాడలో ఘనంగా జ‌రిగింది. విజయవాడలోని గురునానక్‌ కాలనీలోని ఏర్పాటు చేసిన విగ్రహాన్ని లెజెండ‌రీ న‌టుడు కమల్‌హాసన్‌ ఆవిష్కరించారు. ఇండియన్‌-2 సినిమా షూటింగ్‌లో భాగంగా కమల్‌హాసన్‌ విజయవాడ వ‌చ్చారు. ఇందులో భాగంగానే కృష్ణ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ఆవిష్కరణ ఒక సినిమా లెజెండ్ వేడుకను మాత్రమే కాకుండా, సూపర్ స్టార్ కృష్ణ చిత్ర పరిశ్రమపై వేసిన చెరగని ముద్రకు ప్రతీక. ఈ మహత్తర వేడుకని చూసేందుకు సూపర్ స్టార్ అభిమానులు, శ్రేయోభిలాషుల పెద్ద ఎత్తున పాల్గొని కృష్ణపై తమ ప్రేమ, అభిమానాన్ని వ్యక్తం చేశారు.

ఎంటర్ టైన్ మెంట్ వరల్డ్ కు సూపర్‌స్టార్ కృష్ణ గారు చేసిన కృషికి ఈ విగ్రహం కలకాలం నిలువెత్తు నిదర్శనంగా, తరతరాల మధ్య వారధిగా నిలిస్తుంది. విజయవాడలో ఉదయం జరిగిన వేడుకలు సూపర్‌స్టార్ కృష్ణ గారి శాశ్వతమైన వారసత్వాన్ని పునరుద్ఘాటించాయి.ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో దేవినేని అవినాష్, ప‌లువురు రాజ‌కీయ నేత‌ల‌తో పాటు కృష్ణ, మహేశ్‌బాబు అభిమానులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events