డీకే దిలీప్ రాథోడ్, ఆరోహి జంటగా రూపొందిన భక్తిప్రధాన చిత్రం కాశీనగర్-1947. చిత్తజల్లు ప్రసాద్ దర్శకుడు. కదిరి రమాదేవిరెడ్డి నిర్మాత. ఈ సినిమా నిర్మాణం తుదిదశకు చేరుకుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో ఈ సినిమా టీజర్ లాంచ్ కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణగౌడ్, దర్శక,నిర్మాత సాయివెంకట్, సుప్రీంకోర్ట్ న్యాయవాది ఎన్.రామచంద్రరావు, రిటైర్డ్ డీజీపీ సి.ఎన్.గోపీనాథరెడ్డి, కదిరి శ్రీకాంత్‌రెడ్డి ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు. కుటుంబసమేతంగా చూడదగ్గ గొప్ప సినిమా ఇదని దర్శకుడు తెలిపారు. దైవసంకల్పం వల్లే ఈ సినిమా చేయగలిగామని నిర్మాత పేర్కొన్నారు.