Skip to main content

Namaste NRI

ఇద్దరు భారతీయులకు  కీలక పదవులు

అమెరికా ఎగుమతి మండలిలో ఇద్దరు భారతీయ అమెరికన్లను చోటు దక్కే అవకాశం కనిపిస్తున్నది. ఈ మండలి అంతర్జాతీయ వ్యాపారంలో జాతీయ సలహా కమిటీగా వ్యవహరిస్తుంది. ఈ మండలిలో నియమించాలనుకుంటున్న సభ్యుల పేర్లను అధ్యక్షుడు జో బైడెన్ వెల్లడించారు. ఇందులో ప్రముఖ కార్పొరేట్లు పునిత్ రంజన్, రాజేశ్ సుబ్రమణియంకు చోటు దక్కింది. రంజన్‌ గతంలో డెలాయిట్‌ కన్సల్టింగ్‌కు సీఈవోగా పనిచేశారు. ప్రస్తుతం డెలాయిట్‌ గ్లోబల్‌ సీఈఓ ఎమిరిటస్‌గా ఉన్నారు.  ఫెడ్‌ఎక్స్‌కు సీఈవో, అధ్యక్షునిగా సుబ్రమణియమ్‌ కొనసాగుతున్నారు. సుబ్రమణియమ్‌ను ఈ ఏడాది భారత ప్రభుత్వం ప్రవాసీ భారతీయ సమ్మాన్‌ అవార్డ్‌తో సత్కరించింది.

Social Share Spread Message

Latest News