Skip to main content

Namaste NRI

ప్రియదర్శి, నభా నటేష్ల డార్లింగ్ నుంచి ఖలసే సాంగ్ రిలీజ్

డార్లింగ్‌ నుంచి  ఖలసే ప్రియదర్శి, నభా నటేష్‌ జంటగా నటిస్తున్న చిత్రం డార్లింగ్‌. అశ్విన్‌రామ్‌ దర్శకుడు. కె.నిరంజన్‌రెడ్డి నిర్మాత. మేకర్స్‌ ప్రమోషన్స్‌ని మొదలుపెట్టారు. ఈ సందర్భంగా ఈ సినిమా నుంచి తొలిపాట ను విడుదల చేశారు. ఖలసే అంటూ సాగే ఈ పాటను కాసర్ల శ్యామ్‌ రాయగా, వివేక్‌ సాగర్‌ స్వరపరిచారు. హనుమాన్‌ సీహెచ్‌, రామ్‌ మిరియాల కలిసి ఆలపించారు. కామన్‌ మ్యాన్‌ ఫ్రస్టేషన్‌ని ప్రజెంట్‌ చేస్తూ ఈ పాట సాగింది. ఈ పాటలో ప్రియదర్శి తన డాన్స్‌తో అలరించారు. బ్రహ్మనందం, విష్ణు, కృష్ణతేజ, అనన్య నాగళ్ల కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం సినిమా నిర్మాణంలో ఉంది.  ఈ చిత్రానికి కెమెరా: నరేశ్‌ రామదురై, మాటలు: హేమంత్‌.

Social Share Spread Message

Latest News