ఉత్తర కొరియా నేత కిమ్ జాంగ్ ఉన్ తన శారీరక సుఖాల కోసం ఓ ప్లెజర్ స్క్వాడ్‌ను ప్రతి ఏడాది తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ స్క్వాడ్ గురించి యినోమి పార్క్ అనే ఓ మహిళ చాలా రహస్యాలను వెల్లడిం చింది. ప్రతి ఏడాది 25 మంది అందమైన అమ్మాయిలను, అది కూడా కన్యలను ఆ ప్లెజర్ స్క్వాడ్ కోసం కిమ్ సెలెక్ట్ చేస్తారని ఆమె చెప్పింది. అందంగా కనిపించే అమ్మాయిలతో పాటు రాజకీయ నేపథ్యం ఉన్న వారిని కిమ్ ఎంపిక చేస్తారని పేర్కొన్నది. తన ఫ్యామిలీ స్టాటస్ వల్ల రెండు సార్లు ఆ బృందానికి సెలెక్ట్ కాలేకపోయి నట్లు ఆమె వెల్లడించింది. అందగత్తెలను వెతికేందేకు కిమ్ టీమ్ చాలా శ్రమిస్తుందట. ప్రతి క్లాస్‌రూమ్‌కు వెళ్లి అమ్మాయిలను వెతుకుతారట. ఎక్కడైనా స్కూళ్లో చూడచక్కని అమ్మాయి మిస్సైందా అని చూస్తారట. ఆకర్షిం చే అందం ఉన్న అమ్మాయిలను కొందర్ని సెలెక్ట్ చేసిన తర్వాత, వాళ్ల ఫ్యామిలీ స్టేటస్, పొలిటికల్ స్టేటస్ ను పరిశీలిస్తారట. ఆ జాబితాలో ఉత్తర కొరియా నుంచి పారిపోయిన కుటుంబాలు ఉంటే వాళ్లను వదిలేస్తారని చెప్పింది.
ఒక్కసారి ఆ అమ్మాయిలు ప్లెజర్ స్క్వాడ్ కోసం ఎంపికైతే, వాళ్లకు మెడికల్ పరీక్షలు నిర్వహిస్తారు. వర్జిన్ కాదో అవునో నిర్ధారిస్తారు. పరీక్షల సమయంలో చిన్న మచ్చ ఉన్నా, వాళ్లను అనర్హులుగా దూరం పెట్టేస్తారు. చాలా కఠినంగా పరీక్షించిన తర్వాత ఆ అమ్మాయిలను ప్యోంగ్యాంగ్‌లో కిమ్ నివాసానికి పంపిస్తారట. దేశ నియంత కోర్కెలను తీర్చే ఉద్దేశంతో ఆ ప్లెజర్ స్క్వాడ్‌ను తయారు చేస్తారు. మూడు గ్రూపులుగా ఆ స్క్వాడ్ పనిచేస్తుం ది. కొందరు మాసాజ్‌లో శిక్షణ పొందుతారు. కొందరు డ్యాన్స్ అండ్ సాంగ్ కేటగిరీలో ట్రైనింగ్ అవుతారు. ఇక మూడవ గ్రూపులో ఉన్న అమ్మాయిలు మాత్రం కిమ్‌తో సన్నిహిత సంబంధాలు నిలుపుకోవాల్సి ఉంటుంది. వాళ్లు ఆయనతో శృంగారం సంబంధం పెట్టుకుంటారు. కేవలం నియంతతో మాత్రమే కాదు, మరికొందరితో నూ వాళ్లు శారీరక సంబంధం పెట్టుకోవాల్సి ఉంటుందని పార్క్ తెలిపింది.