తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవికి ఎల్.రమణ పార్టీ పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి పంపారు. మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో తాను రాజీనామా చేస్తున్నట్లు చంద్రబాబుకు పంపిన లేఖలో స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నట్లు రమణ తెలిపారు. రాష్ట్ర ప్రగతిలో భాగస్వామ్యం కావాలనే ఉద్దేశంతోనే టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ఆయన వెల్లడిరచారు. 30 ఏళ్లుగా తన ఎదుగుదలకు తోడ్పడిన చంద్రబాబు నాయుడికి ఎల్.రమణ కృతజ్ఞతలు తెలిపారు.
మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో కలిసి రమణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో భేటీ అయిన సంగతి తెలిసిందే. తగిన గుర్తింపు ఇస్తామని, రాజకీయంగా అవకాశాలు కల్పిస్తామని సీఎం ఆయనకు హామీ ఇచ్చారు. దీంతో టీఆర్‌ఎస్‌లో చేరేందుకు అంగీకరించారు. మూడు, నాలుగు రోజుల్లో తెలంగాణ భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరన్నుట్లు సమాచారం.