Namaste NRI

లక్ష గ్రీన్ కార్డులు వృథా.. భారతీయ ఐటీ నిపుణుల ఆగ్రహం

అమెరికాలో శాశ్వత నివాసహోదాకు వీలు కల్పించే గ్రీన్‌కార్డు జారీలో జరుగుతున్న జాప్యం వేలాది మంది భారతీయ ఐటీ ఉద్యోగుల ఆశలపై నీళ్లు చల్లుతున్నది. ఈ ఏడాదికి కేటాయించిన కోటాలోని దాదాపు లక్ష గ్రీన్‌కార్డులు వృథా కానున్నట్టు తెలుస్తున్నది. అమెరికాలో ఉద్యోగం చేసే విదేశీయులకు శాశ్వత నివాసం కల్పించే ఉద్దేశంతో ఆ దేశ సర్కారు ఉద్యోగ ఆధారిత గ్రీన్‌కార్డులను జారీ చేస్తున్నది. దీంట్లో భాగంగా ఏటా 1,40,000 కార్డులను ఇస్తున్నారు. అయితే, ఈ ఏడాది అదనంగా 1.20 లక్షల గ్రీన్‌కార్డులను చేరుస్తూ 2,61,500 గ్రీన్‌కార్డులను జారీ చేయాలని యూఎస్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ సర్వీసెస్‌ (యూఎస్‌సీఐఎస్‌) నిర్ణయించింది.

                అయితే అమెరికా ఫెడరల్‌ గవర్నమెంట్‌ నిబంధనల ప్రకారం.. అమెరికాలో అక్టోబర్‌ 1 నుంచి సెప్టెంబర్‌ 30 వరకు ఆర్థిక సంవత్సరంగా పరిగణిస్తారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది గ్రీన్‌కార్డుల జారీ కోటాను వచ్చే నెల 30 లోపు పూర్తిచేయాల్సి ఉంటుంది. ఒకవేళ నిర్ణీత సమయంలోపు కార్డులను జారీ చేయని పక్షంలో మిగిలిపోయిన కార్డులు రద్ధవుతాయి. కాగా, గ్రీన్‌కార్డుల జారీలో జాప్యంతో వచ్చే నెల 30లోపు లక్ష కార్డులు వృథా కానున్నాయని భారతీయ ఐటీ నిపుణుడు సందీప్‌ పవార్‌ మండిపడ్డారు. ఈ అంశంపై అమెరికాలోని ఓ కోర్టులో పిటిషన్‌ కూడా దాఖలైంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events