Skip to main content

Namaste NRI

లావణ్య త్రిపాఠి నటించిన టన్నెల్‌ ..రిలీజ్‌ ఎప్పుడంటే

అథర్వ మురళి, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన చిత్రం టన్నెల్‌. రవీంద్ర మాధవ దర్శకత్వం. లచ్చురామ్‌ ప్రొడక్షన్స్‌ మీద ఈ మూవీని తెలుగులో రాజు నాయక్‌ గ్రాండ్‌గా రిలీజ్‌ చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత రాజు నాయక్‌ మాట్లాడుతూ తల్లిదండ్రులుగా ప్రమోట్‌ అయిన వరుణ్‌ తేజ్‌, లావణ్య త్రిపాఠిలకు మా టన్నెల్‌ సినిమా టీమ్‌ తరఫున కంగ్రాట్స్‌ చెబుతున్నాం. ఇదొక యాక్షన్‌-థ్రిల్లర్‌. టీజర్‌, ట్రైలర్‌ ఇప్పటికే అడ్రినల్‌ రష్‌ ఇచ్చేలా, ఉత్కంఠ రేకెత్తించేలా సస్పెన్స్‌, థ్రిల్లింగ్‌ మూమెంట్స్‌ ఉన్నాయని ఫ్రూవ్‌ చేశాయి. మరీ ముఖ్యంగా యాక్షన్‌ సీక్వెన్స్‌లు అందరినీ సర్‌ ప్రైజ్‌ చేసేలా ఉన్నాయి. క్రైమ్‌లు చేస్తున్న సైకోని పోలీస్‌ ఆఫీసర్‌ ఎలా పట్టుకున్నాడు? అనే పాయింట్‌తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. టీజర్‌, ట్రైలర్‌ ఇప్పటికే ప్రేక్షకుల్లో అంచనాల్ని పెంచేశాయి. ఆ అంచనాలను మా సినిమా కచ్చితంగా రీచ్‌ అవుతుందనే నమ్మకం ఉంది అని చెప్పారు. ఈనెల 19న గ్రాండ్‌గా ఈ సినిమాని థియేటర్స్‌లోకి తీసుకువచ్చేందుకు నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events