Skip to main content

Namaste NRI

ఉక్రెయిన్ ను విడిచి వెళ్లిపోండి .. భారతీయ విద్యార్థులకు కేంద్రం సూచన

ఉక్రెయిన్‌ పై యుద్ధానికి రష్యా ఉరుముతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తంగా ఉంటోంది. ఉక్రెయిన్‌లో ఉంటున్న భారత విద్యార్థుల క్షేమం కోసం మరోసారి ప్రకటన జారీ చేసింది. విద్యార్థులెవరూ ఉక్రెయిన్‌లో ఉండరాదని స్పష్టం చేసింది. ఆన్‌ లైన్‌ క్లాసులపై మెడికల్‌ యూనివర్సిటీలు అధికారిక ప్రకటన చేసేంత వరకు ఆగొద్దని, వీలైనంత త్వరగా ఉక్రెయిన్‌ను వీడాలని వివరించింది. మెడికల్‌ యూనివర్సిటీలు ఆన్‌ లైన్‌ క్లాసులు నిర్వహించేది లేనిదీ తెలియడం లేదంటూ నిత్యం కీవ్‌ నగరంలోని భారత ఎంసీకి విద్యార్థుల నుంచి ఫోన్‌ కాల్స్‌ వస్తున్నాయి.  ఈ విషయంలో భారత దౌత్య కారాల్యయం ముందే అప్రమత్తమైంది. సంబంధిత విద్యాసంస్థలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతోంది. అయితే అన్‌లైన్‌ క్లాసులపై సమాచారం వచ్చేంత వరకు విద్యార్థులు ఉక్రెయిన్‌లోనే ఉండడం వారి క్షేమం దృష్టాఏమంత మంచిది కాదు. తాత్కాలికంగా ఉక్రెయిన్‌ నుంచి వెళ్లిపోవడమే మంచిది. మెడికల్‌ యూనివర్సిటీల నుంచి ఏదైనా సమాచారం వస్తే వెంటనే తెలియపరుస్తాం అంటూ కీవ్‌లోని భారత దౌత్య కార్యాలయం తెలిపింది.

                 ఉక్రెయిన్‌ పరిణామాల నేపథ్యంలో భారత ఎంబసీ ఇటీవల కాలంలో జారీ చేసిన మూడో అడ్వైజరీ ఇది. ఉక్రెయిన్‌లోని భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు కేంద్రం చర్యలను వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే ఎయిరిండి ప్రత్యేక విమానం డిల్లీ నుంచి ఉక్రెయిన్‌ బయల్దేరింది. 240 మందికి పైగా విద్యార్థులతో ఢల్లీి చేరుకుంది ఈ నెల 24, 26 తేదీల్లోనూ విమానాలను పంపనున్నట్లు ఎయిరిండియా ఇప్పటికే ప్రకటించింది. ఈ నెల 25 నుంచి మార్చి 6 మధ్య మరో నాలుగు విమానాలను నడపనున్నట్లు కేంద్రం తెలిపింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events