Skip to main content

Namaste NRI

ఎన్నారైకి జీవిత ఖైదు

అగ్రరాజ్యం అమెరికాలో  భార్యను అతి కిరాతకంగా కత్తితో పొడిచి చంపిన ఎన్నారై కి న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. 2020లో జరిగిన ఈ ఘటనపై విచారణ చేపట్టిన ఫ్లోరిడా కోర్టు ఎన్నారై ఫిలిప్ మాథ్యూకు తాజాగా జీవిత కారాగార శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. కేరళకు చెందిన ఫిలిప్ మాథ్యూ భార్య మెరిన్‌ జాయ్‌తో కలిసి ఫ్లోరిడాలో నివాసముండేవాడు. ఫ్లోరిడాలోని కోరల్ స్ప్రింగ్స్‌లోని బ్రోవార్డ్ హెల్త్ ఆస్పత్రిలో మెరిన్ నర్సుగా పని చేసేది. అయితే, ఈ దంపతుల మధ్య కుటుంబ విషయాలపై తరచు గొడవలు జరుగుతుండేవి. ఆ గొడవలు అంతకంతకు పెరిగాయి. దాంతో భార్యపై మాథ్యూ కోపం పెంచుకున్నాడు. ఆమెను ఎలాగైనా అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు.

  మెరిన్ జాయ్ 2020 జులై 28న రోజులానే డ్యూటీకి వెళ్లింది. ఆ రోజు విధులు ముగించుకుని తిరిగి ఇంటికి వచ్చేందుకు సెల్లార్‌లోని పార్కింగ్ ప్లేసుకు వెళ్లింది. అప్పటికే అక్కడికి చేరుకున్న మాథ్యూ  మెరిన్‌పై విచక్షణరహితంగా కత్తితో దాడి చేశాడు. ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత అక్కడి నుంచి పారిపోవాలని చూశాడు. ఈ క్రమంలో పోలీసులకు చిక్కాడు. పోలీసుల విచారణలో తన నేరాన్ని అంగీకరించాడు. దీంతో అతడిని పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

Social Share Spread Message

Latest News