కోట బొమ్మాళి పీఎస్ చిత్రం నుంచి విడుదలైన లింగి లింగి లింగిడి అంటూ సాగిన శ్రీకాకుళం మాస్ జానపద పాటకు కొన్ని కోట్ల వ్యూస్ సాధించింది. ఇటీవలే ఈ పాట 30 మిలియన్స్ వ్యూస్ ను పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్రయూనిట్ సెలబ్రేషన్ నిర్వహించింది. 30 మిలియన్స్ కేక్‌ను ఈ సందర్భంగా కట్ చేసి తమ సంతోషాన్ని వ్యక్తం చేసింది చిత్రబందం. తెలుగులో ఇటీవల ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాలను అందించిన గీతా ఆర్ట్స్ 2 సంస్థ. GA2 పిక్చర్స్ బ్యానర్ మలయాళ సూపర్ హిట్ నాయాట్టు కి రీమేక్ గా కోట బొమ్మాళి పీఎస్ ను నిర్మించింది. ఈ సినిమాకి నిర్మాతలుగా బన్నీ వాస్, విద్యా కొప్పినీడి వ్యవహరిస్తున్నారు.తేజ మార్నిదర్శకుడు. శ్రీకాంత్ మేక ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో వరలక్ష్మి శరత్‌కుమార్ ప్రత్యేక పాత్రలో నటిస్తోంది. రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన మోషన్ పోస్టర్ కు చక్కన స్పందన రాగా, ఇటీవల విడుదల చేసిన లింగి లింగి లింగిడి అంటూ సాగిన శ్రీకాకుళం మాస్ జానపద పాటకు కొన్ని కోట్ల వ్యూస్ సాధించింది. తాజాగా ఈ సినిమా టీజర్ నవంబర్ 6న విడుదల చేయనున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. నవంబరు 24న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల చేస్తున్నారు మేకర్స్. పోలీస్ కు రాజకీయనాయకుడికి మధ్య జరిగే పవర్ ఫుల్ పొలిటికల్ పవర్ గేమ్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం నవంబరు 24న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.














