నవదీప్ హీరోగా నటిస్తున్న చిత్రం లవ్, మౌళి. అవనీంద్ర దర్శకత్వం. సి.స్పేస్, నైరా క్రియేషన్స్, శ్రీకర స్టూడియోస్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమం జరిగింది. హీరో విశ్వక్‌సేన్ అతిథిగా విచ్చేసి ట్రైలర్‌ని విడుదల చేసి చిత్ర యూనిట్‌కి శుభాకాంక్షలు అందించారు.దర్శకుడు అవనీంద్ర నాకీ కథ చెప్పి, నన్ను గడ్డం చేసుకోవద్దు, జుట్టు పెంచు, బాడీ బిల్డ్ చెయ్ అని చెప్పాడు. ఏడాది పాటు అదే పనిలో ఉన్నాను. నా కష్టాన్ని చూసిన నా ఫ్రెండ్స్ నీకేం కావాలిరా అని అడిగి ఈ సినిమాకు వాళ్లు చేయవలసింది చేశారు. నిజానికి వాళ్లు లేకపోతే ఈ సినిమా లేదు. ఈ సినిమాకు అన్నీ కలిసొచ్చాయి. కొత్త కథ , తగ్గ లొకేషన్స్ కుదిరాయి అని నవదీప్ తెలిపారు. ఈ కథలో మౌళీ పాత్రకు నవదీప్ కరెక్ట్. మరొకర్ని ఊహిం చలేం. లవ్, మౌళి ని నవదీప్ ఎంత ప్రేమించాడంటే, అసిస్టెంట్ డైరెక్టర్‌గా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా, హీరో గా, కొన్ని సార్లు ఆఫీస్ బాయ్‌గా కూడా వ్యవహరించాడు. తన ప్రేమకు తగ్గ ఫలితం ఈ సినిమా ఇస్తుందని నమ్ముతున్నాను అని దర్శకుడు తెలిపారు.