తేజస్ కంచర్ల హీరోగా గ్రామీణ నేపథ్యంలో రూపొందిస్తున్న ప్రేమకథా చిత్రం ఉరుకు పటేల. వివేక్ రెడ్డి దర్శకత్వం. కంచర్ల బాల భాను నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్య క్రమాలు జరుగుతున్నాయి. ఇటీవల ఈ సినిమా నుంచి ఓరి మాయలోడా అనే లిరికల్ సాంగ్‌ను అగ్ర కథానాయిక శ్రీలీల విడుదల చేసింది. ప్రవీణ్ లక్కరాజ్ సంగీతాన్నందించిన ఈ పాటను శ్రీనివాసమౌళి రాశారు. స్ఫూర్తి జితేందర్ ఆలపించారు. పల్లెటూరి యువకుడి ప్రేమలో పడిన పట్నం అమ్మాయి తన మనసులోని ప్రేమను వ్యక్తం చేసే సందర్భంలో వచ్చే పాట ఇదని, గ్రామీణ అందాలను ఆవిష్కరించే విజువల్స్‌తో ఆకట్టుకుంటుందని మేకర్స్ తెలిపారు. సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకురానుంది.