Skip to main content

Namaste NRI

మంత్రి కేటీఆర్‌ను కలిసిన మహేష్‌ బిగాల

తెలంగాణ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ను టీఆర్‌ఎస్‌ ఎన్నారై కో ఆర్డినేటర్‌ మహేష్‌ బిగాల ప్రగతి భవన్‌లో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా  మంత్రి కేటీఆర్‌ మహేష్‌ బిగాలను అభినందించారు. అనంతరం మహేష్‌ బిగాల మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల ఎన్నారైలతో జరిగిన జూమ్‌ సమావేశం విశేషాలను మంత్రి కేటీఆర్‌ వివరించామని అన్నారు. రానున్న రెండు వారాల తన యూరప్‌ పర్యటనను గురించి  వివరించారు. యూరప్‌లోని వివిధ దేశాలలో అన్ని రాష్ట్రాల ప్రతినిధులని కలిసి దేశ ప్రజల అవసరాలే ఎజెండాగా జాతీయ రాజకీయాల్లో  కేసీఆర్‌ పాత్రపై వివరిస్తామన్నారు. సమావేశంలో ప్రస్తుత పరిస్థితుల్లో దేశ ప్రజల అవసరాలే ఎజెండాగా జాతీయ రాజకీయాల్లో కేసీఆర్‌ కీలక పాత్ర పోషించే దిశాగా అడుగులు వేయాలని చేసిన తీర్మానాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎన్నారైలు అందరూ ముక్త కంఠంతో కేసీఆర్‌ నిర్ణయాన్ని స్వాగతించారని వివరించారు.

Social Share Spread Message

Latest News