Namaste NRI

హరోం హర నుంచి దేవిగా మాళవిక శర్మ

సుధీర్‌బాబు, మాళవికశర్మ జంటగా నటిస్తూ చిత్రం హరోం హర.జ్ఞానసాగర్‌ ద్వారక దర్శకత్వం.  సుమంత్‌ జి.నాయుడు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 1989లో చిత్తూరు జిల్లా కుప్పం నేపథ్యంలో సాగే కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రం.  ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న మాళవిక శర్మను దేవిగా పరిచయం చేస్తూ మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేశారు.  చీరలో అందంగా, సాంప్రదాయబద్ధంగా కార్తికేయుని సన్నిధిలో నిలబడివున్న మాళవికశర్మ స్టిల్‌ ఆకట్టుకునేలా ఉంది. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతున్నదని మేకర్స్‌ చెప్పారు.  ఈ చిత్రానికి కెమెరా: అరవింద్‌ విశ్వనాథన్‌. చైతన్ భరద్వాజ్ సంగీతం సమకూరుస్తున్నారు.  ఈ  చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events