Skip to main content

Namaste NRI

మనోజ్‌, చాందిని జంటగా..14రోజుల ప్రేమాయణం

మనోజ్‌, చాందిని జంటగా నటించిన చిత్రం 14డేస్‌ లవ్‌. నాగరాజు బోడెం దర్శకుడు. సుప్రియ ఎంటర్‌టైన్‌ మెంట్స్‌ పతాకంపై హరిబాబు దాసరి నిర్మించారు. దర్శకుడు మాట్లాడుతూ కుటుంబ విలువలను కాపాడే ప్రయత్నంలో ఆ ఇంటి వారసుడు ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నాడు? అతని ప్రేమకు ఎలాంటి ముగింపు లభించింది? అన్నదే ఈ సినిమా కథాంశం. కుటుంబ గొప్పతనాన్ని తెలియజెప్పే కథ ఇది అన్నారు.  జనవరి 5న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రానికి కెమెరా: కన్నన్‌ మునుస్వామి, సంగీతం: కిరణ్‌ వెన్న, దర్శకత్వం: నాగరాజు బోడెం.

Social Share Spread Message

Latest News