Skip to main content

Namaste NRI

మనోజ్ చేతుల మీదగా థాంక్యూ డియర్ చిత్రంలోని చిక్కక చిక్కిన గుమ్మ సాంగ్ లాంచ్

ధనుష్‌ రఘుముద్రి, హెబ్బా పటేల్‌, నిరోషా ముఖ్య పాత్రల్లో నటిస్తున్న చిత్రం థాంక్యూ డియర్‌. తోట శ్రీకాంత్‌ కుమార్‌ దర్శకత్వం. ఈ చిత్రాన్ని పప్పు బాలాజీ రెడ్డి నిర్మిస్తున్నారు. త్వరలో విడుదలకానుంది. ఈ సినిమాలోని చిక్కక చిక్కిన గుమ్మ అనే గీతాన్ని హీరో మంచు మనోజ్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన  ధనుష్‌కు ఈ సినిమా మంచి బ్రేక్‌నివ్వాలని, వారి కుటుంబం తమకు ఎంతో సన్నిహితులని అన్నారు. ఫీల్‌గుడ్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించామని, యువతకు బాగా నచ్చుతుందని నిర్మాత బాలాజీ రెడ్డి పేర్కొన్నారు. కథానుగుణంగా మంచి పాటలు కుదిరాయని సంగీత దర్శకుడు సుభాష్‌ ఆనంద్‌ అన్నారు. వీరశంకర్‌, నాగ మహేష్‌, రవిప్రకాష్‌ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి నిర్మాణ సంస్థ మహాలక్ష్మి ప్రొడక్షన్స్‌, దర్శకత్వం: తోట శ్రీకాంత్‌ కుమార్‌.

Social Share Spread Message

Latest News