Skip to main content

Namaste NRI

మాజీ మంత్రి దేవినేని ఉమ తో మీట్‌ అండ్‌ గ్రీట్‌

తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావు అమెరికాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఎన్నారై టీడీపీ బోస్టన్‌ విభాగం నిర్వహించిన మీట్‌  గ్రీట్‌ కార్యక్రమానికి హాజరయ్యారు. అభిమానులు, సానుభూతిపరులతో దేవినేని సమావేశం అయ్యారు. అనంతరం ఉమ మాట్లాడుతూ ఆంధ్ర అభివృద్ధి కోసం ఐదు సంవత్సరాల పాటు అవిశ్రాంతిగా తెలుగుదేశం ప్రభుత్వం చేసిన కృషిని సభ్యులకు వివరించారు. ఎన్నారైలు కూడా తమ నియోజకవర్గాలలో బూత్‌ లెవెలో ఓటర్‌ వెరిఫికేషన్‌ చేయించాలని, స్వింగ్‌ ఓటర్లను ప్రభావితం చేసేలా ఇప్పటి నుంచే క్రమపద్ధతిలో కార్యచరణ చేయ్యాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఎన్నారైటీడీపీ.కామ్‌ లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని కోరారు.  ఈ కార్యక్రమానికి 150 మందికి పైగా టీడీపీ అభిమానులు విచ్చేసి అన్న ఎన్టీఆర్‌. విషనరీ లీడర్‌ చంద్రబాబు, కృషీవలుడు ఉమాగార్లపై వారి అచంచలమైన అభిమానాన్ని చాటారు.

Social Share Spread Message

Latest News