Namaste NRI

తానా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో మెగా వైద్యశిబిరం

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), తానా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో మెగా వైద్యశిబిరం జరిగింది. ఈ సేవా కార్యక్రమంలో 650కి పైగా మందికి ఉచిత వైద్యసేవలు అందించారు. తానా ఫౌండేషన్, స్వేచ్ఛ సంస్థలు సంయుక్తంగా ఈ మెగా వైద్యశిబిరాన్ని ఏర్పాటు చేశాయి.  ప్రతి నెలా మొదటి ఆదివారం ఉచిత మెడికల్ క్యాంప్‌ను రెగ్యులర్‌గా నిర్వహిస్తున్నారు. తానా ఫౌండేషన్ క్యాంప్ నిర్వహణలో సహకారం అందించడం ఇది 7వ సారి అని నిర్వహకులు తెలిపారు. ఈ వైద్యశిబిరానికి గౌతమ్‌ అమర్నేని స్పాన్సర్లుగా వ్యవహరించారు. తానా ఫౌండేషన్ తరపున సంస్థ చైర్మన్ వల్లేపల్లి శశికాంత్ క్యాంప్ నిర్వహణను పర్యవేక్షించారు.

Untitled 5 0aec8562f2
Mayfair 22

ఈ క్యాంప్‌‌కు గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, మియాపూర్‌ తదితర ప్రాంతాల్లోని స్లమ్స్‌ నుంచి దాదాపు 650 మంది హాజరయ్యారు. ఈ మెడికల్‌ క్యాంప్‌ కోసం 26 మంది వైద్యుల బృందం పని చేస్తుంది. వీరంతా రొటేషన్‌ పద్ధతిలో హాజరవుతుంటారని తెలిపారు. ఆర్ధోపెడిక్‌, డయాబెటీక్‌, గైనకాలజీ, పీడీయాట్రిషన్‌ ఇంకా ఇతర విభాగాలకు సంబంధించిన డాక్టర్లు కన్సల్టెన్సీ సేవలు అందించారు. పేషెంట్లు అందరికీ నెలకు సరిపడా మందులను ఉచితంగా అందించారు. విజయవంతంగా ఈ వైద్యశిబిరాన్ని నిర్వహించిన ప్రతి ఒక్కరినీ తానా అధ్యక్షుడు నిరంజన్‌ శృంగవరపు, కో-ఆర్డినేటర్ శ్రీనివాస్ యెండూరి అభినందించారు.

Ixora 22
Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events