Skip to main content

Namaste NRI

ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి కేటీఆర్‌

 భారత రాష్ట్ర సమితి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, తెలంగాణ మంత్రి కేటీఆర్‌ తన ఓటు హక్కు వినియోగించు కున్నారు. బంజారాహిల్స్‌ నందినగర్‌ లో గల ఓ పోలింగ్‌ బూత్‌లో భార్యతో కలిసి ఓటు వేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లేవాళ్లకే ఓటు వేశానని తెలిపారు. తెలంగాణ పౌరుడిగా ఓటు హక్కు వినియోగించుకుని నా బాధ్యత నెరవేర్చా. అభివృద్ధి కోసం పాటు పడే పార్టీకి, ఒక మంచి నాయకుడికి ఓటు వేశా. తెలంగాణలో ఓటు ఉన్న పౌరులంతా ముందుకొచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి. ముఖ్యంగా పట్టణ ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చి ఓటు వేయండి. ఓటు వేసి మీ హక్కును కాపాడుకోండి అంటూ కేటీఆర్‌ పిలుపునిచ్చారు.

Social Share Spread Message

Latest News