ప్రపంచంలో అత్యంత ప్రభావశీల వ్యక్తుల జాబితాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి చోటు లభించింది. వీరిద్దరితో పాటు సీరమ్ ఇన్‌స్టిట్యూట్ సీఈవో అదర్ పూనావాల, ఆసియన్ పసిఫిక్ ఐపాలసీ అండ్ ప్లానింగ్ కౌన్సిల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మంజుషా కులకర్ణికి భారత్ తరపున టైమ్స్ గుర్తింపు లభించింది. 2021 ఏడాదికి గాను అత్యంత ప్రభాశీల వ్యక్తులతో కూడిన వంద మంది జాబితాను టైమ్స్ విడుదల చేసింది. ఈ జాబితాలో విశిష్ట వ్యక్తులు, మార్గదర్శకులు, కళాకారులు, నాయకులు, ఆవిష్కర్తలు వంటి వివిధ కేటగిరీలుగా విభజించారు.
ఈ ప్రపంచ ప్రముఖ వ్యక్తులతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, డ్యూక్ అండ్ డచెస్ ఆఫ్‌న్‌సెక్స్ ప్రిన్స్ హ్యారి అండ్ మేఘన్, మాజీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ, ఇజ్రాయెల్ అధ్యక్షుడు నప్తాలి టన్నెల్, ఇటలీ ప్రధాని మారియో డ్రాగీ, తాలిబన్ గ్రూప్ సహ వ్యవస్థాపకుడు ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్ తదితరులు ప్రపంచ రాజకీయ నాయకులు ఉన్నారు.