Skip to main content

Namaste NRI

 ప్రొఫెసర్‌ విశ్వామిత్రగా మోహన్‌ బాబు

మోహన్‌బాబు నటిస్తున్న తాజా చిత్రానికి అగ్ని నక్షత్రం అనే టైటిల్‌ను ఖారరు చేశారు. శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్‌, మంచు ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై మోహన్‌ బాబు, మంచు  లక్ష్మీ నిర్మిస్తున్నారు.  ప్రతీక్‌ ప్రజోష్‌ దర్శకుడు. ఈ చిత్రంలో మోహన్‌ బాబు ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ని విడుదల చేశారు. ఈ సినిమాలో మోహన్‌ బాబు ప్రొఫెసర్‌ విశ్వామిత్ర పాత్రను పోషిస్తున్నారు. దర్శకుడు మాట్లాడుతూ ఆదర్శవంతమైన జీవితాన్ని గడుపుతూ అన్యాయాల్ని సహించని డైనమిక్‌ సైకియాట్రిస్ట్‌ ప్రొఫెసర్‌గా మోహన్‌ మాబు పాత్ర శక్తివంతంగా ఉంటుందన్నారు.  తండ్రీకూతుళ్లు మోహన్‌ బాబు, మంచు లక్ష్మీ కలిసి నటిస్తున్న తొలి సినిమా ఇదే. మలయాళీ నటుడు సిద్దిఖ్‌ విలన్‌గా నటిస్తున్నారు అని చెప్పారు. ఈ చిత్రంలో మంచు లక్ష్మీ, సముద్రఖని, చైత్రశుక్ల, విశ్వంత్‌, జబర్దస్త్‌ మహేష్‌ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకు కూర్పు: మధురెడ్డి, సంగీతం : లిజో కె జోస్‌, కెమెరా: గోకుల్‌ భారతి.

Social Share Spread Message

Latest News