Skip to main content

Namaste NRI

అమెరికా నుంచి భారత్  కు తరలింపు.. త్వరలో లాంచ్

 భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో), అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) సంయుక్తంగా రూపొందించిన శాటిలైట్‌ను  త్వరలో లాంచ్ చేయనున్నారు. దీని కోసం ఆ ఉపగ్రహాన్ని అమెరికా యుద్ధ విమానంలో భారత్‌కు  తరలించారు. నాసా-ఇస్రో సింథటిక్ ఎపర్చర్ (NISAR)  ఉపగ్రహాన్ని సీ-17 విమానంలో కాలిఫోర్నియా నుంచి బెంగళూరుకు చేర్చారు. ప్రపంచ వ్యాప్తంగా భూమి క్రస్ట్, ఉపరితలం, మంచు ప్రాంతాల్లో మార్పులను పరిశీలించేందుకు అమెరికా, భారత్ కలిసి సంయుక్తంగా ఈ మిషన్ చేపట్టనున్నాయి. నిసార్ ఉపగ్రహం ద్వారా భూ పర్యావరణ వ్యవస్థలలో మార్పులను గమనిస్తారు. అలాగే భూకంపాలు, అగ్నిపర్వత పేలుళ్లు, సముద్ర మట్టం పెరుగుదల వంటి ప్రకృతి వైపరీత్యాల సంకేతాలను ఈ శాటిలైట్ గుర్తించడంతోపాటు హెచ్చరికలు జారీ చేస్తుంది. తద్వారా భూమి క్రస్ట్, ఉపరితలంలో జరుగుతున్న మార్పుల అధ్యయానికి ఇది సహకరిస్తుంది. మరోవైపు 2024లో ఆంధ్రప్రదేశ్‌లోని  సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ శాటిలైట్‌ను  ధ్రువ కక్ష్యలోకి పంపనున్నారు. అమెరికా, భారత్ మధ్య పౌర, అంతరిక్ష సహకారంలో మరో ప్రధాన అడుగు ఈ మిషన్ అని చెన్నైలోని అమెరికా రాయబార కార్యాలయం పేర్కొంది.

Social Share Spread Message

Latest News