పరువు నష్టం కేసులో ఈ నెల 20న జరిగే విచారణకు హాజరు కాకుంటే అరెస్ట్ వారెంట్ జారీ చేస్తామని నటి కంగనా రనౌత్‌ను ముంబై కోర్టు హెచ్చరించింది. గత ఏడాది ఓ టీవీ ఇంటర్వ్యూలో కంగనా జావేద్ అక్తర్‌ను కించపరిచేలా కామెంట్స్ చేయడంతో ఆయన డిఫమేషన్ కేసు వేశారు. ఈ కేసులో కంగనా విచారణకు హాజరు కావాలి. అనారోగ్యం కారణంగా కంగనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ ఆమె లాయర్లు కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై స్పందించిన కోర్టు సెప్టెంబర్ 20న కంగన కోర్టు ముందుకు రాకుంటే అరెస్ట్ వారెంట్ జారీ చేస్తామని హెచ్చరించింది