Skip to main content

Namaste NRI

డొనాల్డ్‌ ట్రంప్‌ కోసం మస్క్‌ భారీ విరాళం.. ప్రతి నెల

అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్‌ పార్టీ తరపున పోటీ చేస్తున్న డొనాల్డ్‌ ట్రంప్‌నకు టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌ బలమైన మద్దతుదారుగా నిలుస్తున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే వెల్లడించిన మస్క్‌, ఇప్పుడు ట్రంప్‌ కోసం భారీ విరాళం ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ట్రంప్‌ కోసం పని చేస్తున్న అమెరికా పీఏసీ అనే సంస్థకు మస్క్‌ నెలకు 45 మిలియన్‌ డాలర్ల(రూ.376 కోట్లు) విరాళంఇచ్చేందుకు ప్రణాళికలు  రూపొందిస్తు న్నామని మస్క్‌ చెప్పినట్లు సమాచారం.  ఈ అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌నకు గానీ, బైడెన్‌కు గానీ  తన వైపు నుంచి ఆర్థిక సహకారం ఉండబోదంటూ గతంలో మస్క్‌ ప్రకటించారు. మనసు మార్చుకున్న మస్క్‌, ఇప్పుడు మరోసారి విరాళాలు అందించేందుకు ముందుకొచ్చినట్లు తెలుస్తోంది.

Social Share Spread Message

Latest News