Skip to main content

Namaste NRI

నా కల ఈ సినిమాతో నెరవేరింది

రోషన్‌ కనకాల  ప్రధాన పాత్రల్లో నటిస్తున్నచిత్రం బబుల్‌గమ్‌. రవికాంత్‌ పేరేపు దర్శకత్వం. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, మహేశ్వరీ మూవీస్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా రోషన్‌ కనకాల మాట్లాడుతూ చిన్ననాటి నుంచే నటుడు కావాలనే కోరిక ఉండేది. నా కల ఈ సినిమాతో నెరవేరింది. నా బాల్యమంతా తాతగారి యాక్టింగ్‌ ఇనిస్టిట్యూట్‌లో గడిచింది. దాంతో తెలియకుండానే నటనపై మక్కువ పెరిగింది. లాస్‌ఏంజెల్స్‌, పాండిచ్చేరిలలో నటనకు సంబంధించిన శిక్షణ తీసుకున్నా. బబుల్‌గమ్‌ సినిమా కోసం షూటింగ్‌కు ముందే వర్క్‌షాప్‌ నిర్వహించారు. ఇది నా ఏజ్‌గ్రూప్‌కు సంబంధించిన కథ. దాంతో సహజమైన నటనను కనబరిచే అవకాశం దొరికింది.

దర్శకుడి సలహాలు కూడా నటన విషయంలో బాగా హెల్ప్‌ అయ్యాయి. ఈ సినిమా కంటెంట్‌ కూడా చాలా కొత్తగా ఉంటుంది. అందుకే విజయంపై పూర్తి నమ్మకంతో ఉన్నాం. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా చిరంజీవి , నాగార్జున వంటి అగ్ర హీరోలను కలవడం, వారి సలహాలు తీసుకోవడం గొప్ప అనుభూతిని అందించింది.మా అమ్మనాన్నకు ఈ సినిమా బాగా నచ్చింది. కొన్ని సీన్స్‌ చూసి నాన్న ఏడ్చారని అమ్మ నాతో చెప్పింది. ఈ సినిమాలో షర్ట్‌లెస్‌ సీన్‌ హైలైట్‌గా ఉంటుంది. ఆ సీన్‌కోసం సిటీ మొత్తం మూడుగంటల పాటు షర్ట్‌ లేకుండా తిరిగాను. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ నటుడిగా నా ప్రతిభను చాటుకోవాలనుంది  అన్నారు.

Social Share Spread Message

Latest News