ఎస్‌ఆర్‌ఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో సప్తగిరి, నేహా సోలంకి జంటగా కె.యం.కుమార్ దర్శకత్వంలో పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, కటారి రమేష్ నిర్మిస్తున్న చిత్రం గూడుపుఠాణి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తుకున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ హీరోగా నాలుగవ చిత్రంలో నటించిన సప్తగిరి దేవుడు ఆశీర్వాదంతో పాటు ప్రేక్షకుల ఆశీస్సులు ఉండాలి. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అన్నారు. హీరో సప్తగిరి మాట్లాడుతూ థ్రిల్లర్ సినిమా గూడుపుఠాణి. నాకు చెప్పిన కథలో దర్శకుడు కొన్ని మార్పులు చేసి అద్భుతంగా ఈ సినిమాను తెరకకెక్కించాడు అని చెప్పారు. నిర్మాతలు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, కటారి రమేష్ మాట్లాడుతూ ఈ సినిమా సప్తగిరి తన నటనతో విశ్వరూపం చూపించాడని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే క్రాంతికుమార్, దర్శకుడు మారుతి, రాంభూపాల్, అలీ, మున్నా, ధనరాజ్, సప్తగిరి, కె.యం. కుమార్, పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, కటారి రమేష్ తదితరులు పాల్గొన్నారు.