Namaste NRI

జాలరి పాత్రలో నాగచైతన్య

నాగచైతన్య, చందు మొండేటి దర్శకత్వంలో  ఓ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్‌ దశలో ఉన్న ఈ సినిమా షూటింగ్‌ త్వరలో మొదలుకానుంది. శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా చందు మొండేటి ఈ కథ తయారు చేసుకున్నాడు. ఇందులో నాగచైతన్యది జాలరి పాత్ర. అందుకే ఆ పాత్రకు తగ్గట్టుగా తన శరీరాన్ని మలచుకునే పనిలో ఉన్నాడు నాగచైతన్య. ఫిట్నెస్‌ కోసం జిమ్‌లో తను గట్టిగా కష్టపడుతూ ఓ వీడియోను ఎక్స్‌(ట్విటర్‌)లో పొందుపరిచాడు. ఈ వీడియోలో చైతూ నిజంగానే చాలా ధృఢంగా కనిపిస్తున్నాడు. పాత్రకోసం తను బాగా మారిపోయాడని ఈ వీడియో చూసినవారంతా చర్చించుకుంటున్నారు. గీతా ఆర్ట్స్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events