Skip to main content

Namaste NRI

నాన్న నువ్ నా ప్రాణం..యానిమల్ సాంగ్ రిలీజ్

రణ్‌బీర్‌ కపూర్‌ హీరోగా నటిస్తున్న క్రైమ్‌ డ్రామా యానిమల్‌. సందీప్‌రెడ్డి వంగా దర్శకుడు. టీ సిరీస్‌, భద్రకాళి పిక్చర్స్‌ నిర్మిస్తున్నాయి. రష్మిక మందన్న కథానాయిక.  భూషణ్‌కుమార్‌, ప్రణయ్‌రెడ్డి వంగా ఈ చిత్రానికి నిర్మాతలు. ఈ చిత్రంలో బాబీడియోల్‌, త్రిప్తి దిమ్రీ కీలక పాత్రలు పోషించారు.  మేకర్స్‌ ఈ చిత్రం నుంచి నాన్నా నువ్వు నా ప్రాణం అంటూ సాగే గీతాన్ని విడుదల చేశారు. తండ్రీ కొడుకులు రణ్‌బీర్‌, అనిల్‌కపూర్‌ మధ్య అనుబంధాన్ని మనసుకు హత్తుకునేలా ఉంది. ఈ గీతాన్ని సోనూ నిగమ్‌ ఆలపించారు. ఈ చిత్రం డిసెంబర్‌ 1న విడుదలవుతోంది.

Social Share Spread Message

Latest News