నారా రోహిత్ నటించిన రాజకీయ నేపథ్య చిత్రం ప్రతినిధి. దాంతో ఆ సినిమాకు సీక్వెల్‌గా రూపొందిన ప్రతినిధి 2 కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రముఖ జర్నలిస్ట్ మూర్తి దేవగుప్తపును దర్శకు డిగా పరిచయం చేస్తూ కుమార్ రజాబత్తుల, ఆంజనేయులు శ్రీతోట, సురేంద్రనాథ్ బొల్లినేని నిర్మిస్తున్నారు. ఈ విషయాన్ని ఉగాది సందర్భంగా నిర్మాతలు ప్రకటించారు. ఈ చిత్రంలో సిరీ లెల్లా కథానాయిక. దినేష్ తేజ్, సప్తగిరి, జిషు సేన్‌గుప్తా, సచిన్ ఖేడేకర్ నటిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం విడుదలైన టీజర్‌కు అద్భుత మైన స్పందన వస్తున్నదని, సినిమా అంతకు మించిన స్థాయిలో ఉంటుందని, నారా రోహిత్ ఇంటెన్స్ పెర్‌ఫార్మెన్స్ సినిమాకు హైలైట్‌గా నిలువనుందని నిర్మాతలు తెలిపారు. నిజాయితీ గల న్యూస్ రిపోర్టర్‌గా నారా రోహిత్ నటిస్తున్నాడు. ఈ చిత్రం ఈ నెల 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రానికి కెమెరా: నాని చమిడిశెట్టి, సంగీతం: మహతి స్వరసాగర్.