Skip to main content

Namaste NRI

నవీన్‌ పొలిశెట్టి అనగనగా ఒక రాజు.. రాజు గారి పెళ్లిరో సాంగ్ రిలీజ్

యువ హీరో నవీన్‌ పొలిశెట్టి అనగనగా ఒక రాజు చిత్రంతో వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో దిగుతున్నారు. మారి దర్శకత్వం. ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్నారు. మ్యూజికల్‌ ప్రమోషన్స్‌లో భాగంగా రాజుగారి పెళ్లిరో అనే గీతాన్ని విడుదల చేశారు. పెళ్లి నేపథ్యంలో ఉత్సాహభరితంగా సాగిందీ పాట. మిక్కీ జే మేయర్‌ స్వరపరచిన ఈ పాటను చంద్రబోస్‌ రచించారు.

నాయకానాయికలు నవీన్‌ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి హుషారైన డ్యాన్స్‌ మూమెంట్స్‌తో ఈ పాటకు కొత్త జోష్‌ తీసుకొచ్చారు. ప్రేక్షకుల మనసుల్లో ఎప్పటికీ నిలిచిపోయే పెళ్లి పాట అవుతుందని మేకర్స్‌ తెలిపారు. ఆద్యంతం హాస్యప్రధానంగా సాగే ఫ్యామిలీ డ్రామా ఇదని, భారీ స్థాయిలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నామని చిత్రబృందం పేర్కొంది. జనవరి 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జే మేయర్‌, నిర్మాణ సంస్థలు: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్‌, దర్శకత్వం: మారి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events