Skip to main content

Namaste NRI

పవన్ ఫ్యాన్స్‌కు.. న్యూ ఇయర్ సర్‌ప్రైజ్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులకు అదిరిపోయే న్యూ ఇయర్ సర్‌ప్రైజ్ వ‌చ్చింది. పవన్ 32వ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. టాలీవుడ్ స్టైలిష్ ఫిల్మ్ మేకర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ భారీ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత రామ్ తాళ్ళూరి నిర్మించనున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు ప్రముఖ రచయిత వక్కంతం వంశీ కథను అందిస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 

ఈ సందర్భంగా నిర్మాత రామ్ తాళ్ళూరి స్పందిస్తూ జైత్ర రామ మూవీస్ సంస్థపై ప్రొడక్షన్ నంబర్ 1గా నా డ్రీం ప్రాజెక్ట్ మొదలు పెడుతున్నాను. మన ప్రియతమ పవర్ స్టార్ ఆశీసులతో, ఆయన పేరు పెట్టిన బ్యానర్ మీద సినిమా చేయడం ఆనందంగా ఉంది. సురేందర్ రెడ్డి, వక్కంతం వంశీతో కలిసి సినిమా చేస్తున్నందుకు, ఈ డ్రీం ప్రాజెక్ట్ నిర్మిస్తున్నందుకు గర్వంగా ఉంది అని పేర్కొన్నారు.

Social Share Spread Message

Latest News