వినాయక చవితి పండుగ సందర్భంగా నితిన్ కొత్త చిత్రం ప్రారంభించారు. ఎడిటర్ ఎస్.ఆర్.శేఖర్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా మారుతున్నారు. ఉప్పెన ఫేమ్ కృతిశెట్టి ఇందులో నితిన్‌కి జంటగా నటిస్తోంది. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌లో సుధాకర్ రెడ్డి, నిఖిత రెడ్డి ఈ మూవీని సంయుక్తంగా నిర్మించనున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ముఖ్య అతిథిగా విచ్చేసి క్లాప్ కొట్టారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా టైటిల్‌ను ఖరారు చేస్తూ టైటిల్, మోషన్ పోస్టర్లను విడుదల చేశారు మేకర్స్. మణిశర్మ తనయుడు యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ మహతి స్వర సాగర్ సంగీతం అందించబోతున్నారు. నితిన్ కెరీర్‌లో 31వ చిత్రంగా తెరకెక్కబోతున్న దీని రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ నుండి ప్రారంభించబోతోంది.