Skip to main content

Namaste NRI

సరిపోదా శనివారం సెకండ్‌ సింగిల్‌ రిలీజ్

నాని కథానాయకుడిగా రూపొందుతోన్న చిత్రం సరిపోదా శనివారం. ప్రియాంక అరుళ్‌ మోహన్‌ కథానాయిక. వివేక్‌ ఆత్రేయ దర్శకుడు. డీవీవీ దానయ్య, కల్యాణ్‌ దాసరి నిర్మాతలు. ప్రమోషన్‌లో భాగంగా ఈ సినిమాలోని సెకండ్‌ సింగిల్‌ ఉల్లాసం సాంగ్‌ని మేకర్స్‌ విడుదల చేశారు. అరె ఏమయ్యింది ఉన్నట్టుండివ్వాళే.. అలవాటే లేని ఏవో ఆనందాలే అంటూ సనరే రాసిన ఈ పాటను జేక్స్‌ బిజోయ్‌ స్వరపరచగా, సంజిత్‌ హెగ్డే, కృష్ణలాస్య ఆలపించారు. తొలి ప్రేమ అనుభవాలను తెలియజేస్తూ రొమాంటిక్‌గా ఈ పాట సాగింది. ఇందులో నాని, ప్రియాంక మోహన్‌ల నేచురల్‌ ఎక్స్‌ప్రెషన్స్‌ చూడొచ్చు. యువతరాన్ని ఆకట్టుకునేలా ఈ పాట విజువల్స్‌ ఉన్నాయి. ఎస్‌.జె.సూర్య కీలక పాత్ర చేస్తున్న ఈ చిత్రంలో సాయికుమార్‌ ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. వచ్చే నెల 29న సినిమా విడుదల కానుంది.  ఈ చిత్రానికి కెమెరా: మురళి జి., నిర్మాణం: డి.వి.వి.ఎంటర్‌ టైన్‌ మెంట్స్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events