Skip to main content

Namaste NRI

టీఆర్‌ఎస్‌ ప్లీనరీకి హాజరైన ఎన్నారైలు

హైదరాబాద్‌లోని హెచ్‌ఐఐసీలో టీఆర్‌ఎస్‌ పార్టీ 21వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. టీఆర్‌ఎస్‌ ప్లీనరీకి టీఆర్‌ఎస్‌ ఎన్నారై కో ఆర్డినేటర్‌ మహేష్‌ బిగాలతో పాటు వివిధ దేశాల ఎన్నారై ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మహేష్‌ బిగాల మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం ఆవిర్భవించిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఆ లక్ష్యాన్ని నెరవేర్చిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అద్భుతంగా పురోగమిస్తుందన్నారు. రాష్ట్రం మరింతగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఒమన్‌, జర్మనీ, చైనా, ఫిలిప్పీన్స్‌, ఖతార్‌, నార్వే, జాంబియా,  మారిషన్‌, టాంజానియా,  దక్షిణాఫ్రికా, మలేషియా,  బహ్రెయిన్‌, ఆస్ట్రేలియా, యూఎస్‌ఏ, యూకే తదితర దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News