Skip to main content

Namaste NRI

ఘనంగా ఎన్నారైల మొవెంబర్ ఈవెంట్

లండన్‌లోని స్లవ్ ప్రాంతంలో ప్రవాస భారతీయులు స్థాపించిన బెర్కషైర్ బాయ్స్ కమ్యూనిటీ అనే ఛారిటబుల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో  మొవెంబర్  అనే ఈవెంట్‌ని ఘనంగా నిర్వహించారు. మగవారిలో వచ్చే ప్రోస్టేట్ కాన్సర్ గురించి అవగాహన కోసం ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో నిర్వహిస్తున్నామని ఆర్గనైజేషన్ కార్య నిర్వాహక సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన సుమారు 2 లక్షల రూపాయలను మొవెంబర్ ఛారిటీకి అందజేశామన్నారు.

ఈ కార్యక్రమంలో కార్య నిర్వాహక సభ్యులు సంజీవ్ అంకిరెడ్డి, గోవర్ధన్ వడ్లపట్ల, సతీష్ చింతపండు, విషి మనికిరెడ్డి, రవి మంచిరాజు, సత్యనారాయణ నోముల, రవి మేకల, సత్యనారాయణ ఆవుల, శ్రీధర్ బేతి, తిరుమల కాగిత, ప్రకాష్ విత్తనాలు, రమేష్ బుక్క పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News